కై లాస్‌నగర్: పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగ తి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. రిమ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగింది. అ నంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించా లన్నారు. పలువురికి ఫుడ్ లైసెన్స్ అందజేశారు. వివిధ ఆహార ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన మేళా ను తిలకించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో జిల్లా ఆహార భద్రత అధికారి ప్ర త్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్ పాల్గొన్నారు.


