పతకాల రేసులో ‘శివాని’ | - | Sakshi
Sakshi News home page

పతకాల రేసులో ‘శివాని’

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

క్రీడా పాఠశాల విద్యార్థి ఎం.శివాని వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2025లో హన్మకొండ వేదికగా నిర్వహించిన సౌత్‌ జోన్‌ పోటీల్లో 600 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన ఈ క్రీడాకారిణి, అదే ఏడాది హైదరాబాద్‌ జింఖానా మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్‌ అండర్‌–17 పోటీల్లో 3వేల మీటర్ల రేస్‌ వాక్‌లో రజత పతకాన్ని కై వసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది జనవరి 17న ఆదిలాబాద్‌లో నిర్వహించిన సబ్‌ జూనియర్‌ మీట్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటుతోంది. 2025 డిసెంబర్‌ 11న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్‌ అండర్‌–17 నేషనల్స్‌ పోటీల్లో 3వేల మీటర్ల రేస్‌ వాక్‌ విభాగంలో పాల్గొని సత్తా చాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement