ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న డి. నాగిని ప్రియ జూడోలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాలతో దూసుకుపోతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎస్జీఎఫ్ అండర్–17 అంతర్ జిల్లాల స్థాయి పోటీల్లో, సబ్ జూనియర్ కేడెట్ అంతర్ జిల్లాల పోటీల్లో రెండు స్వర్ణ పతకాలను సాధించి సత్తా చాటింది. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సీఎం కప్ జూడో చాంపియన్షిప్‌లో బంగారు పతకం కై వసం చేసుకుంది. వీటితో పాటు చైన్నెలో నిర్వహించిన సౌత్ జోన్ పోటీల్లో, వరంగల్‌లో జరిగిన జూనియర్ మీట్‌లో రజత పతకంతో మెరిసింది. 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ (గుజరాత్), కేరళలోని త్రిస్సూర్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మార్షల్ ఆర్ట్స్‌లో తనదైన ఆటతీరుతో మెరుస్తోంది.


