కై లాస్‌నగర్: ఆదిలాబాద్ జెడ్పీ నూతన సీఈవోగా బి.రవి నియామకమయ్యారు. హన్మకొండ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జిల్లాలో రెగ్యులర్ సీఈవోగా పనిచేసిన జి.జితేందర్ రెడ్డిని ఆయిల్ ఫెడ్ ఎండీగా ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రెగ్యులర్ సీఈవోను నియమించకపోవడంతో డీఆర్డీవో రాథోడ్ రవీందర్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఏడు నెలల తర్వాత ఎట్టకేలకు జెడ్పీకి రెగ్యులర్ సీఈవో రానున్నారు.


