దారికాచిన మృత్యువు..! | - | Sakshi
Sakshi News home page

దారికాచిన మృత్యువు..!

Jan 21 2026 6:54 AM | Updated on Jan 21 2026 6:54 AM

దారికాచిన మృత్యువు..!

దారికాచిన మృత్యువు..!

లారీలోని ఐరన్‌డోమ్‌ను ఢీకొన్న కారు ఘటన స్థలంలోనే నలుగురు మృతి భైంసాలో అర్ధరాత్రి.. మృత్యుఘోష..! మృతులది కుభీర్‌ మండలం కుప్టి ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ

వారంతా ఊరు పెద్దలు.. తమ ఊరి పిలగాడిని పట్నం ఆస్పత్రిలో పరామర్శించారు. సాయంత్రం తిరుగు పయనమయ్యారు. కాసేపట్లో గమ్యం చేరాల్సిన వారిని అర్ధరాత్రి మృత్యువు దారి కాచి కబళించింది. చివరి ప్రయణంలో విగతజీవులైన నలుగురిని చూసి ఆ ఊరంతా కన్నీరు పెట్టింది.

మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

భైంసాటౌన్‌/కుభీర్‌: నిర్మల్‌ జిల్లా భైంసా పట్ట ణ శివారులో సోమవారం అర్ధరాత్రి ఘోర రో డ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘట న లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. కుభీర్‌ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాలుడు సిద్ధార్థ్‌ అనా రోగ్యంతో హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడిని పరామర్శించేందు కు కుప్టి సర్పంచ్‌ పోతుగంటి గంగారాం, ఉపసర్పంచ్‌ గుండోల్ల శ్రీనివాస్‌(చిన్ను), భోస్లే భోజరాం పటేల్‌, కొడిమెల రాజ న్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్‌రావు, కుభీర్‌కు చెందిన బొప్ప వికాస్‌ కారులో సోమవారం ఉదయం హైదరాబాద్‌ బయల్దేరారు. బాలుడిని పరామర్శించారు. అతడి తల్లిదండ్రులకు ధైర్యం చె ప్పారు. సాయంత్రం స్వగ్రామానికి బయల్దేరా రు. అర్ధరాత్రి తర్వాత భైంసా–నిర్మల్‌ జాతీయ రహదారి మీదుగా భైంసా పట్టణ శివారులోని సాత్‌పూల్‌ వంతెన వద్దకు చేరుకున్నారు.

20 నిమిషాలయితే ఇంటికి..

మరో 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే గ్రామానికి చేరుకునేవారు. కానీ ఇరుకుగా ఉన్న సాత్‌పూల్‌ వంతెనపై ఎదురుగా లారీ ఓ పెద్ద ఐరన్‌ డోమ్‌తో నిర్మల్‌ వైపు నుంచి భైంసా వైపు వెళ్తోంది. చీకట్లో ఐరన్‌ డోమ్‌ కనిపించకపోవడంతో వీరి కారు వేగంగా వెళ్లింది. డోమ్‌ కారుకు తాకి.. కుడివైపు భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో డ్రైవర్‌ బొప్ప వికాస్‌(25)తోపాటు వెనుక సీట్లో ఉన్న భోస్లే భోజరాం పటేల్‌(40), కొడిమెల రాజన్న(58), బోయిడి బాబన్న(70) అక్కడికక్కడే మృతిచెందారు. ఐరన్‌ డోమ్‌కు ఎలాంటి సూచిక ఏర్పాటు చేయకుండా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వంతెనపై వీధి దీపాలు కూడా వెలగకపోండం మరో కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

హుటాహుటిన సహాయక చర్యలు..

ప్రమాదం జరిగిన వెంటనే భైంసా ఏఎస్పీ రా జేశ్‌మీనా, పట్టణ సీఐ సాయికుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను వెలికి తీయించారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చే శారు. స్థానికులు సైతం సహాయకచర్యల్లో పా ల్గొన్నారు. మృతదేహాలను భైంసాలోని ప్రభు త్వ ఏరియాస్పత్రికి తరలించారు. సర్పంచ్‌ గంగారాంకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు..

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు, కుప్టిగ్రామస్తులు హుటాహుటి న భైంసా ఏరియా ఆస్పత్రికి చేరుకున్నా రు. ఆస్పత్రిఆవరణలో వారి రోదనలు మిన్నంటా యి. ముధోల్‌ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్ర మాదానికి కారణాలను అడిగితెలుసుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల మంగళవారం ఉదయం భైంసాకు చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించా రు. సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసు, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు.

మృత్యుంజయులు..

ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులో ప్రయాణిస్తున్న సిందే ఆనంద్‌రావు, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ముందు సీట్లో కూర్చున్న ఆనంద్‌రావు ఎయిర్‌బ్యాగ్‌ ఓపెన్‌ కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. వెనుక సీటులో ఎడమవైపు కూర్చున్న శ్రీనివాస్‌కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు.

కన్నీరు పెట్టిన కుప్టి

ఒకే గ్రామానికి చెందిన నలుగురు పెద్ద మనుషులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుప్టిలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి తరలించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రకు ఊరంతా కదిలి వచ్చి కడసారి వీడ్కోలు పలికింది.

ముగ్గురూ ఊరి పెద్దలు..

కుప్టి గ్రామానికి చెందిన భోజరాం పటేల్‌తో పాటు కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్‌రావు గ్రామంలో పెద్ద మనుషులుగా వ్యవహరిస్తుంటారు. అనుకోని ప్రమాదం ముగ్గురినీ కబళించింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. భోజరాంపటేల్‌ గ్రామంలోనే ఉంటూ భైంసా పట్టణంలో వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం తమ ఇంటి పెద్దలలను బలిగొనడంతో ఆ కుటుంబాల రోదన వర్ణనాతీతం. ఇక తాజాగా సర్పంచ్‌గా ఎన్నికై న గంగారాం పేద కుటుంబానికి చెందినవారు. ఇటీవల గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్‌ రావడంతో గ్రామపెద్దలు ముందుండి అతన్ని గెలిపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు బ్రెయిన్‌ సర్జరీ చేశారు.

పెళ్లి కావాల్సిన ఇంట..

కుభీర్‌కు చెందిన బొప్ప చంద్రబాయి– నాగలింగం దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు వినోద్‌ ఆర్మీలో పని చేస్తుండగా, మూడో కుమారుడు వివేక్‌ డిగ్రీ చదువుతున్నాడు. రెండో కుమారుడైన వికాస్‌మిషన్‌ భగీరథలో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు ఖాళీ సమయంలో తన సొంతకారును అద్దెకు నడుపుతున్నాడు. సోమవారం కుప్టి గ్రామస్తులతో హైదరాబాద్‌ వెళ్లాడు. తిరిగి వస్తుండగా రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. పచ్చని పందిరితో కళకళలాడాల్సిన చోట విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement