నేడు, రేపు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
కై లాస్‌నగర్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బయలుదేరి సాయంత్రం 4గంటలకు ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.35గంటలకు పులిమడుగు గ్రామానికి చేరుకుంటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు. అక్కడి నుంచి కుమ్మరితండాకు చేరుకుని గ్రామస్తులతో సమావేశమవుతారు. అనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌కు చేరుకుని సాయంత్రం 6నుంచి 7గంటల వరకు విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల 22న ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించనున్న గిరిజన దర్బార్‌లో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొననున్నారు.


