మరోసారి గుర్తింపు సర్వే
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా దుకాణాలు, ఇళ్లు కోల్పోయే వారి గుర్తింపునకు అధికారులు మంగళవారం సర్వే చేపట్టారు. గతంలోనే సర్వే నిర్వహించి బ్రిడ్జి నిర్మాణంలో కోల్పోయే ఇళ్లు, దుకాణాలకు మార్కౌట్ కూడా ఇచ్చారు. అయితే పలువురి దుకాణాలు అప్పటి సర్వేలో తప్పిపోయినట్లుగా బాధితులు అధికారులకు నివేదించారు. దీంతో ఆర్‌అండ్‌బీ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులు స్థానిక ఆర్టీవో కార్యాలయ సమీపంలో ఆర్‌వోబీ నిర్మాణంలో కోల్పోయే దుకాణాల గుర్తింపునకు మరోసారి సర్వే చేశారు. హద్దులు ఏర్పాటు చేశారు. ఆర్‌యూబీ, ఆర్‌వోబీ నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయే వారికి వారం రోజుల్లో పరిహారం అందనున్నట్లుగా ఆర్‌అండ్‌బీ డీఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు.


