రహదారి భద్రత అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని జిల్లా జడ్జి ఎం.ప్రభాకర్ రావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమాన్ని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రహదారి భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 20 శాతం వరకు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తోందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా అదనపు సెషన్స్ జడ్జి రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఏఎస్పీ పి.మౌనిక, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్, పీపీ సంజయ్ వైరాగరి, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఐఎంఏ ఆదిలాబాద్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


