ఆర్టీసీ కండక్టర్‌పై ఆటో కార్మికుల దాడి
నిడదవోలు: పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి కండక్టర్‌పై ఆటో కార్మికులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి రాత్రి 7 గంటలకు రాజమహేంద్రవరం వెళుతున్న బస్సుకు అడ్డంగా రోడ్డుపై ఓ ఆటో నిలిపివేశారు. బస్సు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో డ్రైవర్ ఎ.రబ్బానీ హారన్ కొడుతున్నా ఆ ఆటోను పక్కకు తీయలేదు. దీంతో కండక్టర్ సుధీర్ కుమార్ కిందకి దిగి ఆటో తీయాలని చెప్పడంతో ఆటోడ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. అనంతరం కండక్టర్ తిరిగి బస్సులోకి వచ్చి టికెట్లు కొడుతున్న సమయంలో ఉల్లి నాగు తన అనుచరులతో కలిసి బస్సులో ఉన్న కండక్టర్‌ను దుర్భాషలాడుతూ దాడి చేశాడు. గాయాలపాలైన కండక్టర్‌ను బస్సు డ్రైవర్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కండక్టర్ సుధీర్‌కుమార్‌కు చికిత్స పొందుతున్నారు.


