తెల్లారిన కూలీల బతుకులు..!
ముగ్గురు మహిళా కూలీల మృతి మరొకరి పరిస్థితి విషమం.. 16మందికి గాయాలు ఇందారం క్రాస్‌రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం వరినాట్ల కోసం వలస వస్తుండగా ఘటన
జైపూర్: తెల్లవారితే గమ్యం చేరేవా రే.. పొట్టకూటి కోసం కట్టుకున్న వారిని.. కన్నవారిని విడిచి రాష్ట్రం దాటొచ్చిన వలస కూలీల బొలేరో వాహనంపైకి ప్రమాదం బొగ్గులారీ రూపంలో దూసుకొచ్చింది. గాఢనిర దలో ఉన్న కూలీలంతా ఒక్కసారిగా ఉల్కికిపడ్డారు. ఏం జరిగిందో నని నిద్ర నుంచి తేరుకునే సరికే ప్రమాదం జరిగిపోయింది. ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత పడగా.. మరో 16మందిని క్షతగ్రాత్రులను చేసింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి 20మంది కూలీలు ఆదివారం రాత్రి 10గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు బొలేరో వాహనంలో బయల్దేరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలోని మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున 3.30 గంటలకు బొలేరో వాహనాన్ని శ్రీరాంపూర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న బొగ్గులారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా బొలేరో వాహనాన్ని ఢీకొట్టగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. దీంతో బొలేరో వాహనంలో ఉన్న 16మంది మహిళా కూలీలు, నలుగురు పురుషులు ఒకరిపైనొకరు పడి ఒత్తిడికి గురయ్యారు. చంద్రపూర్ జిల్లా సావ్లీ మండలం చాందిలిబుజ్ గ్రామానికి చెందిన మీనా(45)కు ఛాతిపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఇదే మండలంలోని దిగోరి గ్రామానికి చెందిన మందారీ లీలాబాయ్(65), బెంబిల్ గ్రామానికి చెందిన సోయం విమల్‌బాయ్(57)కు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా చనిపోయారు.
క్షతగాత్రులు వీరే..
సాధనవికాస్ టేకం రేఖవిజయ్ గాత్రే, మమతలక్ష్మ ణ్, శకుంతలపుప్పేశ్వర్ టేకం, మేఘాకార్తీక్ శ్రీరామి, పౌర్ణిమ సురేశ్, ఆత్రం సుమన్‌బాయి, తొడాసే సలోనిఅర్జున్, టేకం వికాస్‌విశ్వనాథ్, నీలిమస్వప్నిల్, మాయ మాఘు సరిత జితేంద్ర మోర్లే, కల్పన దీపక్ గద్దె, విజయ్ సంతోశ్ బొడ్కావర్ గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అందరినీ 108వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై శ్రీధర్ తెలిపారు.
వరి నాట్ల కోసం వలస
ప్రతిఏటా వరి నాట్ల సీజన్‌లో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన మహిళా కూలీలు తెలంగాణలోని పెద్దపల్లి, కరీంగనర్ ప్రాంతాలకు వలస వస్తారు. కూలీలంతా బొలెరో వాహనంలో వస్తుండగా ఊహించని విధంగా లారీ రూపంలో మృత్యువు దూసుకు వచ్చింది. బొలెరో వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టడం కూలీల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ముగ్గురు చనిపోవడం, కూలీలు తెచ్చుకున్న వంట సామగ్రి, వస్తువులు చెల్లాచెదురు కావడం చూసి కంటతడి పెట్టారు. లేటేవార్ మీనా మృతిచెందగా ఆమె భార్త అనిల్ లేటేవార్ కూడా ఇదే వాహనంలో ఉన్నాడు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దిక్కుతోచని స్థితిలో కన్నీరుపెడుతూ సంఘటన స్థలంలో ఉన్నారు.
తెల్లారిన కూలీల బతుకులు..!
తెల్లారిన కూలీల బతుకులు..!
తెల్లారిన కూలీల బతుకులు..!


