అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయ ఏవో దామోదర స్వామి అన్నారు. కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొని ఏజెన్సీ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి కల్పించాలని కొందరు, పింఛన్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని మరికొందరు అర్జీలు సమర్పించారు.
దుర్గం శేఖర్‌పై మరో కేసు
ఆదిలాబాద్‌టౌన్: దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దుర్గం శేఖర్‌పై మరో కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. రిమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి స్టేషన్ నుంచి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఇంట్లో చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని భాగ్యనగర్‌లో నివాసం ఉండే ఎర్రంవార్ విజయ్ ఇంట్లో ఆది వారం రాత్రి చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు చొరబ డ్డారు. బీరువా పగలగొట్టి నగదుతో పాటు బంగారం ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.లక్ష 80 వేల వరకు ఉంటుందని బాధితుడు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు పేర్కొన్నారు.


