బాధలోనూ.. బాధ్యతలు స్వీకరణ
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న బండారి పుష్ప, భర్త బండారి రవీందర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తై గుర్తులు కేటాయించాక అనివార్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సోమవారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రమాణం చేసేందుకు వచ్చిన సర్పంచ్ బండారి పుష్ప ఎంతో బాధతో బాధ్యతలు స్వీకరించింది. ఆ సమయంలో ఆమెతో పాటు వచ్చిన కుటుంబీకులు, పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టడం కలిచివేసింది. సర్పంచ్‌గా రాణించి రవీందర్ ఆశయసాధనకు కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బండారి రవీందర్ ఫొటోతో ఆ నలుగురు సినిమాలోని ‘నేనే గెలిచాను.. నేనే గెలిచాను.. కాదు నన్ను గెలిపించారు.. ఈ ప్రపంచాన్ని గెలిపించేది.. డబ్బుకాదు ప్రేమే’ అంటూ రవీందర్ దంపతుల ఫొటోతో ఉన్న వీడియోలు వైరలయ్యాయి.


