విధుల్లో నిర్లక్ష్యంపై ఉపేక్షించం..
బేల: విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ అన్నా రు. మండలంలోని ఖడ్కీ గ్రామంలో గల గిరిజ న సంక్షేమ ప్రాథమిక పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయుడు రాథోడ్ రామారావు విధి నిర్వహణపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విచా రణ నివేదికను అధికారులకు అందజేసి వారి ఆదేశానుసారం చర్యలు చేపడుతామన్నారు. అనంతరం చంపెల్లి, బేల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రత్యేక ప్రణాళికపై ఆరా తీశారు. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ఐటీడీఏ అకడమిక్ మానిటరింగ్ అధికారి జగన్ ఉన్నారు.


