రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాలలో ఏజీ (బీఎస్సీ) రెండో సంవత్సరం చదువుతున్న వీ అనూష రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల కు ఎంపికై నట్లు పీడీ నాగమణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 2న నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్ ఉమెన్స్ ఎంపిక పో టీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో ఈనెల 8నుంచి 10వరకు నిర్వహించనున్న పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. కళాశాల అసిస్టెంట్ డీన్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఓఐఎస్సీ డాక్టర్ మంజులత, అధ్యాపకులు, సిబ్బంది అనూషకు అభినందనలు తెలిపారు.


