ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం

Nov 7 2025 7:10 AM | Updated on Nov 7 2025 7:10 AM

ఆర్‌అ

ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం

● హ్యామ్‌ ప్రాజెక్ట్‌ కింద పది ఎంపిక ● రూ.114కోట్ల నిధులు మంజూరు ● రాష్ట్ర స్థాయిలోనే టెండర్ల ప్రక్రియ ● పాత జాతీయ రహదారి 7 నుంచి వాంకిడి, మహబూబ్‌ఘాట్‌ వరకు 10.20 కిలో మీటర్ల డబుల్‌ లేన్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ● ఆదిలాబాద్‌ నుంచి కెరమెరి వరకు 41.25 కిలో మీటర్ల రోడ్డు మంజూరు కాగా, ఇందులో 4.65 కిలో మీటర్ల వరకు సింగిల్‌ లేన్‌, 36.6 కిలో మీటర్లు డబుల్‌లేన్‌ నిర్మించనున్నారు. ● జైనథ్‌ మండలం కాప్రి ఎక్స్‌ రోడ్డు నుంచి ఆనంద్‌పూర్‌, కూర గ్రామం వరకు 25 కిలో మీటర్ల రోడ్డు పనులు చేపట్టనుండగా, ఇందులో 5.22 కిలో మీటర్లు సింగిల్‌ లేన్‌, 19.78 కిలో మీటర్లు డబుల్‌ లేన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ● ఆదిలాబాద్‌ నుంచి కెరమెరి రోడ్డు 42కిలో మీటర్ల దూరం నుంచి 55.6 కిలోమీటర్ల వరకు 13.60 కి లో మీటర్ల వరకు రోడ్డు మంజూరు కాగా, ఇందులో 10.06 కిలో మీటర్లు సింగిల్‌ లేన్‌, మరో మూ డు కిలోమీటర్లు డబుల్‌లేన్‌ నిర్మించనున్నారు, ● ఇచ్చోడ నుంచి మాన్కాపూర్‌, నర్సాపూర్‌, చించోలి, జామిడి గ్రామాల మీదుగా సిరిచల్మ వరకు 16కిలో మీటర్ల వరకు సింగిల్‌ లేన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ● గుడిహత్నూర్‌ నుంచి ఉట్నూర్‌ వరకు 35.06 కిలో మీటర్ల వరకు డబుల్‌లేన్‌ నిర్మించనున్నారు. ● ఉట్నూర్‌ నుంచి ఇంధన్‌పల్లి మధ్యలో 35.6 నుంచి 37.60 కిలో మీటర్ల వరకు రెండు కిలోమీటర్లు డబుల్‌లేన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ● ఆదిలాబాద్‌ నుంచి రాంపూర్‌, పొన్నారి, ఖోడద్‌, హస్నాపూర్‌, సుంకిడి, లక్ష్మింపూర్‌ గ్రామాల మీదుగా తలైగూడ వరకు 23.30 కిలో మీటర్ల వరకు డబుల్‌లేన్‌ నిర్మించనున్నారు. ● ఉట్నూర్‌ నుంచి ఆసిఫాబాద్‌ వరకు ఎనిమిది కిలో మీటర్ల వరకు డబుల్‌లేన్‌ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.

కైలాస్‌నగర్‌: ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) ప్రాజెక్ట్‌ కింద జిల్లాలోని 10 రోడ్లను ఎంపిక చేసింది. 174.95 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణాల కోసం రూ.114 కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరగా ప్రారంభమైతే రోడ్ల రూపురేఖలు మారి ప్రజల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

తొలగనున్న ఇబ్బందులు

అధ్వాన రహదారులపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎట్టకేలకు వీటి నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. హ్యామ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా కాంట్రాక్టర్లకు మోబలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద 10శాతం నిధులు ముందుగానే ఇవ్వనుంది. మరో 30శాతం 30 నెలల్లో వాయిదా పద్ధతుల్లో చెల్లించేందుకు యోచిస్తోంది. మిగతా 60 శాతం నిధులను కాంట్రాక్టర్లు సొంతంగా వెచ్చించాల్సి ఉంటుంది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లే 15ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు తీసుకునేలా నిబంధనలున్నాయి.

ఇవీ.. అభివృద్ధికి నోచుకునే రోడ్లు

త్వరలో టెండర్లు పిలిచే అవకాశం

జిల్లాలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనుల టెండర్‌ ప్రక్రియ హైదరాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ రాష్ట్ర కార్యాలయం ద్వారానే ఆన్‌లైన్‌లో చేపట్టి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తారు. ఉన్నతాధికారులు త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశముంది.

– ఎస్‌.నర్సయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ

ఇది ఉట్నూర్‌ నుంచి ఇంధన్‌పల్లికి వెళ్లే మార్గంలోని బిర్సాయిపేట వద్దగల రోడ్డు. పూర్తిగా గుంతలమయమైంది. ఇటీవల ఓ లారీ గుంతను తప్పించబోయి చెట్టుకు ఢీకొట్టింది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ముందు టైర్లు ఊడిపోయాయి. దీనిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇచ్చోడ నుంచి సిరిచెల్మ గ్రామానికి వెళ్లే ఈ రోడ్డు ఏళ్ల తరబడి నిర్వహణ లేక పలుచోట్ల తారు లేచి మట్టిరోడ్డుగా మారింది. ఈ రోడ్డు గుండా సుమారు నాలుగైదు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగి స్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురికాక తప్పని పరిస్థితి ఉంది.

ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం1
1/1

ఆర్‌అండ్‌బీ రోడ్లకు మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement