బాల్యవివాహాలతో అనర్థాలు
ఆదిలాబాద్‌టౌన్: బాల్యవివాహాలతో అనర్థాలెదురవుతాయని శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర తెలిపారు. ‘బాల్యవివాహ రహిత తెలంగాణ’లో భాగంగా గు రువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉ న్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. బాల్యవివాహాలతో విద్య, ఆ రోగ్యం సామాజికపరంగా నష్టపోయే ప్రమాదంఉందని తెలిపారు. బాల్య వివాహాలను నియంత్రించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 1098, 181, 100 నంబర్లకు సమాచారం అందించాలని తెలిపా రు. అనంతరం ష్యూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమాధికారి మిల్కా, హెచ్‌ఎం సాజీల బేగం, డిస్టిక్ర్ట్ మిషన్ కో ఆర్డినేటర్ యశోద, డీసీపీవో రాజేంద్రప్రసాద్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లావణ్య, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ సతీశ్, ష్యూర్ ఎన్జీవో కో ఆర్డినేటర్ వినోద్, సిబ్బంది సౌజన్య ఉన్నారు.


