ఉట్నూర్ రూరల్: వార్షిక తనిఖీల్లో భాగంగా ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజ న్ గురువారం అదనపు ఎస్పీ కాజల్‌సింగ్‌తో క లిసి తనిఖీ చేశారు. ఆవరణలోని వాహనాలను పరిశీలించారు. రికార్డులు పరిశీలించి కేసుల వి వరాలు తెలుసుకున్నారు. అంతకుముందు స్టే షన్ ఆవరణలో సిబ్బందికి మాక్ ఆపరేషన్ డ్రి ల్‌పై సూచనలు చేశారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులపై బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు. పోలీసుల గౌరవం పెంచేలా విధులు నిర్వహించాలని సూచించారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. రా త్రి వేళ ఫింగర్ ప్రింట్ యంత్రం ద్వారా తనిఖీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరించాలని సూచించారు. ఎస్పీ వెంట ఉట్నూర్ సీఐ, ఎస్సైలు మడావి ప్రసాద్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.


