యువత స్వయం ఉపాధి పొందాలి
కైలాస్‌నగర్: ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని కలెక్ట ర్ రాజర్షి షా సూచించారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులను తీర్చిదిద్దేందుకు ఇలాంటి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో ఇలాంటి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, న్యాక్ ఏడీ స్వప్నరాణి తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ క్యాంపులను వినియోగించుకోవాలి
జిల్లాలో ఆధార్ సవరణ కోసం ఏర్పాటు చేయను న్న ఇంటిగ్రేటెడ్ క్యాంపులను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. తలమడుగు, తాంసి, భీంపూర్, బోరజ్, జైనథ్, సాత్నాల మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 6నుంచి జి ల్లాలో ఆధార్ సవరణ ఇంటిగ్రేటెడ్ క్యాంపులు ప్రా రంభమవుతాయని తెలిపారు. విద్యార్థుల ఆధార్‌కా ర్డుల్లో దొర్లిన తప్పులను సవరించుకోవాలని సూచించారు. హెచ్‌ఎంలు ముందుగానే విద్యార్థుల ఆధార్ వివరాలు పరిశీలించి, సవరణ అవసరమైతే వారిని క్యాంపునకు తీసుకురావాలని తెలిపారు. క్యాంపులు నిర్వహించనున్న పాఠశాలల్లో ముందుగానే వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆర్డీ వో స్రవంతి, డీపీవో రమేశ్, ఈడీ ఎం.రవి, అధికా రులు రఘు, రమణ తదితరులు పాల్గొన్నారు.


