
బల్దియా ఇంజినీర్ వేతనంలో కోత
కై లాస్‌నగర్: వనమహోత్సవంలో భాగంగా ఇళ్లలో పెంచేందుకు అందించాల్సిన మొక్కల పంపిణీపై ఆదిలాబాద్ మున్సిపల్ అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ‘మొక్కలు తెప్పించారు.. పంపిణీ మరిచారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. మొక్కలను ఒకేచోట నిల్వ ఉంచిన మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల సరఫరా, పంపిణీ తీరు, వనమహోత్సవ కార్యక్రమ లక్ష్యం, నాటిన మొక్కల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును ఆదేశించా రు. బల్దియా పర్యావరణ ఇంజినీర్ అవికిరణ్ బా ధ్యతారాహిత్యంపై మండిపడ్డ కలెక్టర్ వారం రో జుల వేతనాన్ని కోత విధించాలని కమిషనర్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన బల్దియా అధికారులు ఎట్టకేలకు సోమవారం మొక్కల పంపిణీ ప్రారంభించారు.

బల్దియా ఇంజినీర్ వేతనంలో కోత