
వంతెన నిర్మించండి
– మర్కగూడ గ్రామస్తులు, ఇంద్రవెల్లి
మా గ్రామం నుంచి ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో గల వాగుపై వంతెన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపాటి వర్షం కురిసినా ఉప్పొంగి ప్రవహించడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. విద్యార్థులు పాఠశాల, కళాశాలకు వెళ్లాలన్నా, అత్యవసర పరిస్థితులో వైద్యం కోసం వెళ్లాలన్న వాగు దాటేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోగా, గర్భిణులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి కనీసం లోలెవల్ వంతెన నిర్మించి ప్రయాణ కష్టాలు తొలగించాలి.