
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించండి
– ఆదివాసీ మహిళలు, చించుఘాట్, ఆదిలాబాద్‌రూరల్
మేమంతా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలం. కూలీనాలీ చేసుకుని జీవించే నిరుపేదలం. మాకు ఉండేందుకు పక్కా ఇళ్లు కూడా లేవు. గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నాం. మాకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వసతి సౌకర్యం కల్పించేలా చూడాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.