
రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని రాస్తారోకో
జన్నారం: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ ఖేల్ కన్వీనర్ పందిరి మనీష్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ ఖేల్ కాలేజ్ ప్రెసిడెంట్ రిశ్వంత్, సెక్రటరీ అంజేష్, నాయకులు మహేష్, అమన్, అభిలాష్, సాయి, సంజయ్, అధికసంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.