
లంబాడాలు మా అవకాశాలను కొల్లగొట్టారు
గుడిహత్నూర్: రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చొరబడిన లంబాడాలు తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొల్లగొట్టారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని మా న్కాపూర్ నుంచి మండల కేంద్రం వరకు రెండున్న ర కిలోమీటర్లు సాంప్రదాయ వాయిద్యాలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కవి తారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో తీర్పు వచ్చే వరకు వారికి ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయిసెంటర్ల సార్‌మేడీలు పెందూర్ జైరాం, కాత్లే భరత్, రాజ్‌గోండ్ సేవా సమితి నాయకులు లక్ష్మణ్, భగవాన్, భీంరావ్, జల్పత్, గణేశ్, జంగుపటేల్, మండలంలోని ఆయా గ్రామాల పటేళ్లు, నాయకులు పాల్గొన్నారు.