
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నూ సత్తా చాటాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఉష్కం రఘుపతి అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సోమవారం నిర్వహించిన సబ్ జూనియర్ జిల్లాస్థాయి బాల, బాలికల కబడ్డీ ఎంపిక పోటీలను ఆయన ప్రా రంభించి మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీల్లో నూ అత్యుత్తమంగా రాణించి జిల్లాకు మంచి పేరు తేవా లని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, పలువురు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.