
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
ఆదిలాబాద్‌టౌన్: అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని సంబంధిత తహసీల్దార్లు, అధికారులతో జూమ్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకనుంచి ప్రతి సోమవారం జూమ్ ద్వారా అధికారులతో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.ఈ వారం గ్రీవెన్స్‌లో 105 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎస్‌వో వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
టెట్ మినహాయించాలి
2010 సంవత్సరానికి ముందు ఉద్యోగంలో ప్రవేశించిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలని టీపీయూఎస్ నాయకులు కోరారు.ఈ మేర కు కలెక్టర్ రాజర్షిషాను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునిల్ కుమార్, గోపీకృష్ణ తదితరులు ఉన్నారు.