
సమాజ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం
ఆదిలాబాద్‌టౌన్: గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని ఆర్కిటెక్ ఇంజినీర్ అండ్ ఎల్టీపీ అధ్యక్షుడు అన్నదానం జగదీశ్ అన్నారు. ఇంజినీర్స్ డేను పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించారు. వి శ్వేశ్వరయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.
ఎస్‌ఈ కార్యాలయంలో..
కైలాస్‌నగర్: ఇంజినీర్స్ డే వేడుకలను జిల్లా పరిషత్‌లోని పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, డీఈ కుందన్, ఏఈలు సంతోష్, చంద్రశేఖర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.