
జిల్లాకు చేరుకున్న ముఖ్య అతిథి
కై లాస్‌నగర్: ప్రజాపాలన దినోత్సవ వేడుకల ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మంగళవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. పట్టణంలోని పెన్‌గంగ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులతో జిల్లా పాలన అంశాలపై కాసేపు చర్చించారు. కాగా, బుధవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.