
సాయుధ పోరులో.. బోథ్ బిడ్డలు
బోథ్: తెలంగాణ సాయుధ పోరాటంలో బోథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమంలో భాగంగా నాడు మహారాష్ట్రలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ ప్రాంత బిడ్డలు రజాకార్ల వెన్నులో వణుకుపుట్టించారు. అయితే కదనరంగంలో కొందరు తుపాకుల తూటాలకు బలైతే... అజ్ఞాతంలో తిండి తిప్పలు లేక మరికొందరు ప్రాణాలు విడిచారు.
బోథ్ వీరులు వీరే..
బోథ్‌కు చెందిన ఏనుగు మల్లారెడ్డి, బి.వెంకట్రావ్, గుండేరావు, తక్కల చరణ్‌దాస్‌రెడ్డి, పూండ్ర రాజిరెడ్డి, ప్రభాకర్‌రావు, శంకర్ దేవిదాస్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, సొనాలకు చెందిన లక్ష్మణ్‌రావు సూర్య, దొండబాయి, యార్లరెడ్డి, దేవ్‌రావు, లింగారెడ్డి, బజార్‌హత్నూర్‌కు చెందిన లక్ష్మణ్ సింగ్, శంకర్ సింగ్, ఆనందబాయి, ధన్నూర్‌కు చెందిన డి.రాజన్న, నడిపన్న, చట్ల నారాయణ, సింగం వీరన్న, గంగాధర్, తేజాపూర్‌కు చెందిన డి.చిన్నముత్యంతో పాటు మరికొందరు సాయుధ పోరులో ముందు నిలిచారు.