
వీడీసీలపై కొరడా
● ఆనంద్‌పూర్‌లో ఎనిమిది మందిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)పై పోలీసులు కొరడా ఝుళి పించారు. ‘మళ్లీ షురూ.. ’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవా రం ప్రచురితమైన కథనాని కి జిల్లా పోలీసు శాఖ స్పందించింది. ఈ మేర కు జైనథ్ మండలం ఆనంద్‌పూర్‌లో ఇసుక వేలంకు సిద్ధమైన 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి వివరించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు న్నా యంత్రాంగాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో బెల్టుషాపులు, కల్లు దుకా ణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇవ్వడానికి వీడీసీలకు అర్హత లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా గ్రామాభివృద్ధి పాలనలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు స మీపంలోని పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధి లో ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో జైనథ్‌లో 10, బోథ్ సర్కిల్‌లో 2, ఆదిలాబాద్‌రూరల్‌లో 4 కేసులు ఉన్నట్లు వివరించారు.