
కనులపండువగా శోభాయాత్ర..
వినాయక నిమజ్జన శోభాయాత్ర వినాయక్ చౌక్ నుంచి జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్, అశోక్ రో డ్,దేవిచంద్ చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్, శివా జీ చౌక్, ఠాకూర్ హోటల్, రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా ముందుకు సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథాలలో రంగురంగుల విద్యుత్ దీప కాంతుల నడుమ వైవిధ్య రూపాల్లో కొలువుదీరి దేదీప్యమానంగా వెలుగుతున్న గణాధీషులను వరుస క్రమంలో చాందా టీ వాగు, ఎన్‌హెచ్ 44 మీదుగా పెన్ గంగ వరకు చేర్చారు. అక్కడే వినాయకునికి నిమజ్జనోత్సవ పూజా కార్యక్రమం చేపట్టి వినాయకా.. సెలవిక అంటూ నిమజ్జన క్రతువును ముగించారు.