
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని డీవైఎస్‌వో జక్కు ల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజ రై మాట్లాడారు. వాలీబాల్, క్రికెట్, క్యారం, చెస్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ క్రీ డాంశాల్లో పోటీలు నిర్వహించగా సుమారు 100 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 16 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీ రంతా హైదరాబాద్‌లోని వివిధ మైదానాల్లో నిర్వహించనున్న పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.