
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: న్యాయవాదుల సమస్యల పరి ష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కె.సుజన అన్నారు. జిల్లా కోర్టుకు శనివారం విచ్చేసిన ఆమెను బార్ అసొసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో అమాయాక ప్రజలు ఎక్కువగా ఉంటారని వారికి సత్వర న్యాయం అందించేలా న్యాయవాదులు పూర్తి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర రావు, న్యాయమూర్తులు డాక్టర్ శివరాం ప్రసాద్, కుమార్ వివేక్, లక్ష్మికుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, ప్రధాన కార్యదర్శి శర్మ, న్యాయవాదులు పాల్గొన్నారు.
జైనథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
జైనథ్: మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వా మి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి సృజన కు టుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారి వెంట జిల్లా జడ్జి ప్రభాకరరావు, ఆలయ కమిటీ చైర్మన్ రూకేశ్‌రెడ్డి, తహసీల్దార్ నారాయణ, తదితరులున్నారు.