
మంత్రి ‘అడ్లూరి’ని కలిసిన సుగుణ
ఉట్నూర్‌రూరల్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. ఈమేరకు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని, భారీ వర్షాలతో నష్టపోయిన రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు చేయాలని, జైనూర్ ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని మంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె పేర్కొన్నారు.
మంత్రిని కలిసిన టీపీటీఎఫ్ నాయకులు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీపీటీఎఫ్ నాయకులు ఆదివారం మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావు, నాయకులు రమేశ్, రామచంద్రం, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, జ్ఞానేశ్వర్, సుధాకర్ తదితరులున్నారు.