
నేటి నుంచి రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్ పోటీలు
ఆదిలాబాద్‌టౌన్: సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్ పోటీలు ఈనెల 8,9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షనిక్ ప్రముఖ్ చక్రవర్తుల కృష్ణ ఆచార్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంస్కృతికి నిలయాలుగా భావించే శిశు మందిరాల్లో చదువుతో పాటు విద్యార్థులకు బోధనేతర అంశాల్లో తర్ఫీదు ఇచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ఖేల్‌కూద్ పోటీల్లో భాగంగా పరుగుపందెం, హైజంప్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రోతో పాటు ఇతర పోటీలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభిస్తారని వివరించారు.