
జిల్లా ఆడిట్ అధికారికి పదోన్నతి
కై లాస్‌నగర్: జిల్లా సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్, ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న జే.నర్సయ్యకు స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయ న్ను నిర్మల్ జిల్లా సహకారశాఖ అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను జిల్లా సహకార అధికారి బి.మోహన్, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు ముజఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.