
వాగు దాటి.. పరామర్శించి
భీంపూర్: మండలంలోని భగవాన్‌పూర్ గ్రామంలో నవజాత శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈమేరకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశానుసారం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, పంచాయతీరాజ్ డీఈఈ శివరాం నాయక్ మంగళవారం గ్రామంలో పర్యటించారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో కాలినడకన వెళ్లారు. వాగు దాటి గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న నవజాత శిశువు తల్లి ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. వారి వెంట మండల వైద్యాధికారి నిఖిల్‌రాజ్, ఆరోగ్య విస్తీర్ణాధికారి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు రూహిదాస్, మేఘ, ఎంఎల్‌హెచ్‌పీ మాయావతి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

వాగు దాటి.. పరామర్శించి