
స్వరూపం ఇలా..
కొనసా..గుతున్న ఎన్‌హెచ్ 353(బి) నిర్మాణ పనులు వచ్చే ఏడాది మే వరకు గడువు తర్నం వద్ద షురూ కాని ‘హైలెవల్’ తాత్కాలిక వంతెనపై రాకపోకలకు ఇబ్బంది భోరజ్ వద్ద వీయూపీకి లభించని గ్రీన్‌సిగ్నల్
జైనథ్, బేల,నిరాల, బెల్గాం వద్ద మొదట సర్వీ స్ రోడ్లు నిర్మిస్తారని పేర్కొన్నారు. తర్వాత మార్పులు చేశారు. అక్కడ జనసంచారం అధి కంగా ఉన్న దృష్ట్యా ఫోర్‌లేన్‌గా విస్తరిస్తున్నా రు. మొత్తం 20 మీటర్ల రహదారి చేపడుతుండగా, ఇరువైపులా 10 మీటర్ల చొప్పున రహదారి ఉంటుంది. మధ్యలో 1.5 మీటర్లలో డివైడర్ నిర్మిస్తున్నారు. స్ట్రీట్‌లైట్లను కూడా ఏర్పా టు చేస్తున్నారు.
తరోడా (తర్నం)గ్రామం వద్ద హై లెవల్ బ్రిడ్జి 11 మీటర్ల రహదారి పోర్షన్‌తో నిర్మించనున్నా రు. ఇందులో 1.6 మీటర్ల ఫుట్‌పాత్ రెండువైపులా వస్తుంది.
భోరజ్ వద్ద మరో వెహికిల్ అండర్ పాస్ నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి భోరజ్ వద్ద ఒక హెక్టార్ భూ సేకరణ చేస్తున్నారు. 12 మీటర్ల విస్తీర్ణంలో ఈ వీయూపీ ఉండనుంది. ఇది ఎన్‌హెచ్‌ఏఐ 44 దిగువన ఉండడంతో ఈ నిర్మాణానికి సంబంధించి అనుమతి నివేదించగా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.
సాక్షి,ఆదిలాబాద్: జాతీయ రహదారి 353(బి) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కేవలం 33 కిలో మీటర్ల పరిధిలో ఎన్‌హెచ్ నిబంధనలకు అనుగుణంగా ఈ డబుల్‌లేన్‌ను పటిష్టపర్చాల్సి ఉండగా, నిర్మాణ పనులు ఆలస్యంగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో పనులు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది మే లోగా పూర్తి చేయాలి. అయితే ఆశించిన స్థాయిలో పనులు పూర్తి కావడం లేదు. విస్తరణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. తర్నం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇంకా అడుగే పడలేదు. భోరజ్ వద్ద మరో వెహికిల్ అండర్‌పాస్ (వీయూపీ) నిర్మాణానికి ఇంకా అన్ని అనుమతులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గడువులోపు పనులు పూర్తయ్యేది అనుమానంగానే కనిపిస్తోంది.
ఎన్‌హెచ్‌గా అప్‌గ్రేడ్..
నాలుగున్నరేళ్ల క్రితం అంతర్రాష్ట్ర రహదారిగా ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫోర్‌లేన్‌గా విస్తరిస్తారని పేర్కొన్నప్పటికీ ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ పరిగణలోకి తీసుకొని చివరికి డబుల్ లేన్‌నే మరింత విస్తరించి ఎన్‌హెచ్ నిబంధనలకు అనుగుణంగా పటిష్టపర్చాలని నిర్ణయం తీసుకున్నారు. గతేడాది మొదట్లో ఔరంగాబాద్‌కు చెందిన ఆర్‌బీ ఘోడ్కే కాంట్రాక్ట్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. మొత్తంగా సర్వే, టెండర్, అగ్రిమెంట్.. ఇలా ప్రతీ అంశంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో పనుల ప్రారంభమే ఏళ్లకేళ్లు పట్టింది. ఎట్టకేలకు గతేడాది ప్రారంభించినప్పటికీ వేగిరంగా పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్ విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే..
మహారాష్ట్రలోని ఆష్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా భోర జ్ వరకు నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడి వర కు 141కిలోమీటర్లు ఉండగా, జిల్లాలో 33 కిలో మీటర్లు మాత్రమే వస్తుంది.మహారాష్ట్ర ప్రాంతంలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణం పూర్తి చే యగా అక్కడ ఫోర్‌లేన్‌గా విస్తరించారు. తెలంగాణలో ఎన్‌హెచ్ నిర్మి స్తుండగా, ఇక్కడ మాత్రం డబుల్ లేన్‌నే పటిష్టపరుస్తున్నారు. భారతమాల కింద ఈ జాతీయ రహదారికి అంకురార్పణ జరిగింది. కేంద్రం నిధులతో దీన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న ఎన్‌హెచ్‌కు అమలు బాధ్యత అప్పగించారు.
భోరజ్ మండలం తర్నం వాగు వద్ద లోలెవల్ వంతెన పైనుంచి మంగళవారం భారీ వాహనాలు మహారాష్ట్ర వైపు వెళ్తున్న చిత్రమిది. ఇప్పుడైతే ఈ వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండగా, భారీగా వరద వస్తే మాత్రం కష్టమే. ఇరువైపులా బారులు తీరాల్సిందే. భోరజ్ నుంచి జైన థ్, బేల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లేందుకు ఈ జాతీ య రహదారే ప్రధానం. హైలెవల్ వంతెన ఇక్కడ నిర్మించాల్సి ఉండగా, పనుల ప్రారంభంలో అంతులేని జాప్యం వాటిల్లుతోంది. ఇక్కడ ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరగా దానిని కూల్చి కొత్త వంతెన నిర్మించతలపెట్టారు. అయితే నిర్మాణంలో ఆలస్యం అవుతుండడంతో కొన్నేళ్లుగా ఈ రహదారిపై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వరద ప్రవహిస్తుండడంతో పనులు ఇంకా ప్రారంభించలేదు.
రోడ్డు వివరాలు..
అంచనా వ్యయం: రూ.490 కోట్లు (భూ సేకరణకు కలిపి)
రోడ్డు నిర్మాణ వ్యయం : రూ.360 కోట్లు
కాంట్రాక్ట్ సంస్థతో అగ్రిమెంట్ : 46 శాతం లెస్ రూ.194 కోట్లతో..
గడువులోపు పూర్తికి చర్యలు
ఈ పనులను వచ్చే ఏడాది మే లోగా పూర్తి చేస్తాం. ప్రస్తుతం వరద తీవ్రత నేపథ్యంతో ఇంకా హైలెవల్ వంతెన పనులు ప్రారంభించలేదు. ఇప్పటివరకు 33 కిలోమీటర్లలో 26 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు పూర్తయ్యాయి. బ్రిడ్జికి సంబంధించి డిజైన్ పూర్తి చేశాం. ఇక నిర్మాణ పనులపై దృష్టి సారిస్తాం.
– సుభాష్, డీఈ, ఎన్‌హెచ్

స్వరూపం ఇలా..

స్వరూపం ఇలా..

స్వరూపం ఇలా..