
నాణ్యమైన విద్యుత్ అందించాలి
ఆదిలాబాద్‌రూరల్: వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ అందించాలని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్ పర్సన్ ఎరుకల నారాయణ అన్నారు. మావల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో మావల, ఆదిలాబాద్ రూరల్, టౌన్‌త్రీ ఏడీఈ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మంగళవారం నిర్వహించారు. ముందుగా డివిజనల్ పరిధిలోని డీఈ, ఏఈ, ఏవోలతో ఆయ న సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. విద్యుత్ కనెక్షన్లు అందించడంలో జాప్యం, సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన పలు వురు అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని ఆయన అధి కారులను ఆదేశించారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజగౌడ్, సీఈ కేఆర్ చౌహన్, డీఈ ఈదన్న, ఏవోలు, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.