
న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఆదిలాబాద్‌టౌన్: న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్ డిమాండ్ చేశారు. ఓ కేసు విషయంలో ఎన్‌బీడబ్ల్యూ నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఆదిలాబాద్ న్యాయవాదులు కౌషిక్ సింగ్, మనోజ్‌పై నిందితులు దాడి చేయడాన్ని ఖండించారు. ఈమేరకు మంగళవారం విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీ కాంత్, ప్రవీణ్‌రెడ్డి, మహేందర్, సద్దాం, భా వన సింగ్, మహేశ్, విశ్వనాథ్ పాల్గొన్నారు.