
లోకం ఉన్నంత కాలం కవిత్వం
ఆదిలాబాద్‌టౌన్: లోకం ఉన్నత కాలం కవి త్వం ఉంటుందని కవి బూర వెంకటేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదారి నాగదాసు స్మారక కవితా పురస్కార ప్రదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. తన తండ్రి పేరిట ఉదారి నారా యణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కవయిత్రి తోట నిర్మలరాణికి అవార్డు అందజేశారు. పలువురు కవులు కవిత్వాలను విని పించారు. కార్యక్రమంలో సుమనస్పతి రెడ్డి, వసంత్‌రావు దేశ్‌పాండే, మన్నె ఏలియా, ఉదా రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.