
బైబై గణేశా..
ఆదిలాబాద్: చవితి రోజు ఊరూరా, వాడవాడనా కొలువుదీరిన విఘ్నేశ్వరుడు 11 రోజులపాటు భక్తు ల విశేష పూజలు అందుకున్నాడు. ఇంటింటా సందడి చేసిన గణనాయకుడు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన మహోత్సవం వైభవోపేతంగా సాగింది. జిల్లా కేంద్రంలో శోభాయాత్ర సందడి ఆకట్టుకుంది. భక్తి గీతాలు, భజన సంకీర్తనలు, మేళ తాళాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆధ్యంతం భక్తులను పులకింపజేసింది. గణపతి బప్పా మోరియా.. బైబై గణేశా మార్మోగగా.. వెళ్లిరావయ్య గణనాథ అంటూ భక్తి పారవశ్యంతో వీడ్కోలు పలికారు.
శిశు మందిర్‌తో షురూ..
జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్ననాయకునికి ప్రత్యేక పూ జల అనంతరం శోభాయాత్ర ప్రారంభమవ్వడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ఆరంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేలా అధికార యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. హైదరాబాద్ తర్వాత జిల్లా కేంద్రంలోనే వినాయక ఆగమన, నిమజ్జన ఉత్సవాలు వైభవంగా సాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

బైబై గణేశా..

బైబై గణేశా..

బైబై గణేశా..