
ఇవీ ప్రత్యేకం...
జిల్లా కేంద్రంలోని కుమార్‌పేట్ కాలనీలో కుమార్ జనతా గణేశ్‌మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 54 అడుగుల మహా వినాయకుని నిమజ్జ నం నిలుచున్న చోటే జరగడం ప్రత్యే కం. గతేడాది నుంచి ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తుండడం విశేషం. ఈ క్రతువును వీక్షించడానికి భక్తజనం భారీగా తరలివచ్చారు. అలాగే శిశు మందిర్‌లో ప్రతిష్టించిన పార్వతీ తనయుణ్ణి సాంప్రదాయ భక్తి గీతాలు, మేళతాళాలు నడుమ యు వత, చిన్నారులు నృత్యాలతో నిమజ్జనానికి తరలించారు. రిమ్స్ మహాగణపతి ఆలయంలో ప్ర తిష్టించిన శివపుత్రుణ్ణి ఎడ్ల బండిలో నిమజ్జనా నికి తరలించడం విశేషం. డప్పు చప్పుళ్లకు ల యబద్ధంగా స్టెప్పులేస్తూ ఆలయ కమిటీ ప్రతిని ధులు శోభాయాత్రలో భాగస్వాములయ్యారు.

ఇవీ ప్రత్యేకం...