
ఆలయాల అభివృద్ధికి కృషి
నేరడిగొండ/బోథ్: ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని మాదాపూర్ అభయాంజనేయ స్వామి, బోథ్ మండలంలోని కౌట(బి)లోని మల్లికార్జునస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఆలయాల కమి టీ సభ్యులకు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి సీ జీఎఫ్ నిధులతో మొదటి దశలో రూ.25 లక్షలు, మల్లికార్జునస్వామి ఆలయానికి రూ.20 లక్షలు మంజూరు చేయించి ప్రొసీడింగ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు రాథోడ్ సజన్, తుల శ్రీని వాస్, మండల కన్వీనర్లు శివారెడ్డి, నారాయణ రెడ్డి, ప్రతాప్, గులాబ్, గఫ్ఫార్ పాల్గొన్నారు.