
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
కై లాస్‌నగర్: తమ సమస్యల పరిష్కారం కోసం గెస్ట్ లెక్చరర్లు, అంగన్‌వాడీలు సోమవారం ఆందోళన చే పట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించారు.
బీఎల్‌వో విధులు మినహాయించాలని అంగన్‌వాడీలు..
స్థానిక సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన అంగన్‌వాడీలు ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. చిన్నారులకు పోషకాహా రం అందించడం, కేంద్రం నిర్వహణ, న్యూట్రిషి యన్ హెల్త్ చెకప్‌లు, సమాచారం అందించడం వంటి ఐసీడీఎస్‌కు సంబంధించిన అనేక పనులు నిర్వహిస్తున్నారన్నారు. వారిపై మరింత భారం మోపేలా బీఎల్‌వో విధులు అప్పగించడం సరికాదన్నా రు. ప్రభుత్వం వెంటనే దానిని మినహాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ నాయకులు వెంకటమ్మ, సునీత, విజయ, లక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
రెన్యూవల్ చేయాలని గెస్ట్ లెక్చరర్లు..
తమను రెన్యూవల్ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోగాల ప్రవీణ్ మాట్లాడారు. డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజులైనా గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం రెన్యూవ ల్ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో అధ్యాపకులు, విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రూ.50వేల కనీస వేతనాన్ని 12నెలలకు చెల్లించాలని డిమాండ్ చేశా రు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, బి.రాహుల్, ఉపాధ్యక్షులు సుభాష్, కోశాధికారి ఆనంద్, నారాయణ, సంజీవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్