
భువనేశ్వర్ వర్క్‌షాప్‌లో కలెక్టర్
కైలాస్‌నగర్: దేశంలోని ఆస్ప్రేషనల్ బ్లాక్‌లో అమలు చేసిన కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒడిశాలోని భువనేశ్వర్‌లో గురువారం వర్క్‌షాప్ నిర్వహించింది. కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా హాజరయ్యా రు. నార్నూర్ బ్లాక్‌లో బాధ్యతాయుత పాలన కు సంపూర్ణ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆరోగ్యం, విద్య, పోషణ, వ్యవసాయం, ఉపాధి, మౌలిక వసతులు తదితర రంగాల్లో ప్రగతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు ఢిల్లీలో రాజ్యసభకు సంబంధించిన సన్‌సద్ టీవీలో ప్రసారమయ్యే ప్రతిష్టాత్మక అభినవ ప హల్ 3.0 సిరీస్‌కు సంబంధించిన ఇంటర్వ్యూ లో జిల్లా సంక్షేమాధికారి మిల్కాతో కలిసి పా ల్గొన్నారు. నార్నూర్ బ్లాక్‌లో అమలు చేసిన కా ర్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.