
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆదిలాబాద్: జిల్లా స్విమ్మర్లు రాష్ట్రస్థాయి పోటీల్లో నూ రాణించాలని డీవైఎస్వో శ్రీనివాస్, జిల్లా గిరిజ న క్రీడల అధికారి పార్థసారథి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గు రువారం నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఎంపిక పోటీలను వారు ప్రారంభించారు. అనంత రం వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోట ములను సమానంగా స్వీకరించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీలకు గ్రూప్–1 విభాగంలో సీహెచ్ దీక్షిత్, పీ మణిక్రిష్, గాందేవార్ సాయి, బీ విశ్వజ్ఞ, గ్రూప్–2 విభాగంలో చరణ్‌తేజ్, ఎస్.రితేశ్, ఎం.శ్రవాన్‌ష, మనీశ్ రాథోడ్, గ్రూప్–3 విభాగంలో సా యి శివాంక్, జే ఆమోగ్ ఎంపికయ్యారు. జిల్లా స్వి మ్మింగ్ ఆక్వాటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ జిత్ కుమార్, పూల్ నిర్వాహకుడు రాష్ట్ర పాల్, శిక్షకులు కృష్ణ, చందు తదితరులున్నారు.