
వడ్డీలేని రుణం.. అతివలకు వరం
● రూ.1.57 కోట్ల బకాయిల విడుదల ● 4,202 ఎస్‌హెచ్‌జీలకు ప్రయోజనం ● బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్న నగదు
కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇందుకోసం మహిళాశక్తి ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చే స్తోంది. ప్రధానంగా బ్యాంక్‌ల ద్వారా రుణాలిస్తూ వారు ఆర్థికంగా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తోంది. రుణాలను సకాలంలో చెల్లించిన సంఘాల కు వడ్డీ మాఫీ చేస్తున్న ప్రభుత్వం ఈ నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి దీన్ని పక్కాగా అమలు చేస్తూ అతివలకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు రుణాల వడ్డీని విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన వడ్డీ బకాయిలను విడుదల చేసింది. జిల్లాలోని 4,202 సంఘాలకు గాను రూ.1.57 కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేస్తోంది.
ఆర్థిక చేయూతనిచ్చేందుకే..
జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 7,532 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో 1,16,492 మంది సభ్యులున్నారు. వీరు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద బ్యాంక్‌ల ద్వారా స్వయం ఉ పాధి రుణాలు మంజూరు చేస్తోంది. మహిళలు స్వ యం సమృద్ధి సాధించేందుకు తోడ్పడుతోంది. ఈ రుణాలను సకాలంలో వడ్డీతో పాటు బ్యాంక్‌లకు తి రిగి చెల్లించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం వారి వడ్డీని బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ సొమ్ముతో కలిిపి బ్యాంకుల్లో ఉన్న రుణాన్ని తగ్గిస్తారు. తద్వారా మహిళా సంఘాలపై వడ్డీ భారం పడకుండా ఉంటుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రుణాల వడ్డీని చెల్లించకపోవడంతో ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రెండు నెలల బకాయిలు విడుదల
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వడ్డీలేని రుణాలను సక్రమంగా విడుదల చేస్తోంది. ఏడాదిన్నర పాలనలో ఇప్పటివరకు మూడుసార్లు వడ్డీ విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరోసారి రూ.1.57 కోట్లు విడుదల చేసింది. మహిళలను కో టీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను పక్కాగా అమలు చేస్తున్నా రు. తాజాగా జిల్లాలోని 4,202 సంఘాలకు రూ.1.57 కోట్లు విడుదల చేస్తూ మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
మంజూరైన వడ్డీలేని రుణం, సంఘాలు
మండలం మొత్తం మంజూరైన
గ్రూపులు రుణాలు
(రూ.లక్షల్లో)
ఆదిలాబాద్‌రూరల్ 261 10.32
బజార్‌హత్నూర్ 271 10.35
బేల 189 6.84
భీంపూర్ 155 05.35
బోథ్ 541 23.72
గాదిగూడ 121 1.93
గుడిహత్నూర్ 200 07.03
ఇచ్చోడ 265 10.42
ఇంద్రవెల్లి 277 7.65
జైనథ్ 274 10.98
మావల 52 2.10
నార్నూర్ 204 6.82
నేరడిగొండ 296 11.17
సిరికొండ 117 3.80
తలమడుగు 241 9,46
తాంసి 180 7.17
ఉట్నూర్ 558 22.01