ఐటీడీఏ పీవోను తొలగించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ పీవోను తొలగించాలని ధర్నా

Jul 18 2025 5:34 AM | Updated on Jul 18 2025 5:34 AM

ఐటీడీ

ఐటీడీఏ పీవోను తొలగించాలని ధర్నా

కైలాస్‌నగర్‌: గిరిజన నిరుద్యోగులు నష్టపోయేలా ఎ లాంటి గైడ్‌లైన్స్‌ లేకుండా సీఆర్టీ నియామకాలు చేపడుతున్న ఐటీడీఏ పీవోను తక్షణమే విధుల నుంచి తొలగించాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్‌ గోడం గణేశ్‌ డిమాండ్‌ చేశారు. పీవో తీరును వ్యతిరేకిస్తూ గురువారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులతో కలి సి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్టీల నియామకాలపై అనుమానాల ని వృత్తి కోసం విద్యార్థి సంఘాలు, ఆదివాసీ నాయకులు బుధవారం పీవోను కలవగా దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. మెరిట్‌ ప్రకారం ని యామకాలు చేపట్టకుండా గిరిజనేతరులకు లబ్ధి చే కూర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా నోటిషికేషన్‌ ప్రకటించి నియామకాలు చేపట్టా ల్సి ఉండగా 2023 ప్రకారమే నియామకాలు చేపడతామనడం సరికాదని తెలిపారు. వెంటనే పీవోను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో వినోద్‌కుమార్‌ వారి వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. నాయకులు దాదీరావు, దీపక్‌, సుమేశ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ సంఘాల రాస్తారోకో

ఉట్నూర్‌రూరల్‌: ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సమస్యలపై చర్చించడానికి అవకాశం కల్పించడం లేద ని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. సీఆర్టీల నియామకానికి నోటిపికేషన్‌ ప్రకటించలేదని ఆరోపించా రు. బుధవారం జరిపిన సీఆర్టీల డెమో సరిగా లేద ని తెలిపారు. ఈ విషయమై మాట్లాడేందుకు వెళ్లగా పీవో ఆంక్షలు విధించారని, అమర్యాదగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో పీవో వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించినట్లు తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ గోడం గణేశ్‌, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుర్కాపురావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్‌, ఎస్సై ప్రవీణ్‌ వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు దేవేందర్‌, మెస్రం శేఖర్‌ మా ట్లాడుతూ.. పీవో వైఖరిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పీవో తీరు మార్చుకోకుంటే నిరంతరం ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తు డుం దెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘం, ఏజెన్సీ డీఎ స్సీ సాధన సమితి, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

కైలాస్‌నగర్‌: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. నెలకు రూ.6వేల పెన్షన్‌ ఇవ్వాలని, వికలాంగుల కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశా రు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామలాదేవికి వి నతిపత్రం అందజేశారు. నాయకులు నగేశ్‌, పొచ్చ న్న, ఆరిఫా, అనసూయ, ప్రియాంక పాల్గొన్నారు.

ఐటీడీఏ పీవోను తొలగించాలని ధర్నా1
1/1

ఐటీడీఏ పీవోను తొలగించాలని ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement