
ఆపద్బాంధవులు పోలీసులు
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ఆపద సమయంలో పోలీసులు ఆపద్బాంధవులుగా వ్యవహరిస్తారని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ‘డయల్ 100’లోని పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బందికి సీపీఆర్, అత్యవసర సమయంలో స్పందించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ షాక్, పాముకాటు, అగ్నిప్రమాదం, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు చే యాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించా రు. అత్యవసర సమయంలో వైద్యులను పిలిచి ప్ర థమ చికిత్స అందేలా చూడాలని ఎస్పీ సూచించా రు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
ఐఐటీ ర్యాంకర్లకు సన్మానం
ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన పోలీసుల పిల్లలు చౌహాన్ కార్తిక్ (787వ ర్యాంక్), రాథోడ్ లావణ్య (803), రాథోడ్ గోవర్ధన్ (1,506వ ర్యాంక్)ను ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు బహుమతులు అందజేసి అభినందించారు. పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ సులోచన, పోలీస్ అసోసియేషన్ అ ధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, జైస్వాల్ కవిత, వా మన్, కొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
సఖీ కేంద్రం పరిశీలన
జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని ఎస్పీ అఖిల్ మ హాజన్ పరిశీలించారు. కేంద్రం ద్వారా పోలీస్ సేవలు, న్యాయ, వైద్యసహాయం, తాత్కాలిక వసతి, కౌ న్సెలింగ్ అందించనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆ పద సమయంలోనైనా మహిళలు ‘డయల్ 100’, స ఖీ కేంద్రం హెల్ప్‌లైన్ 181ను సంప్రదించాలని సూ చించారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, సఖీ కేంద్రం సిబ్బంది నాగమ ణి, లావణ్య, సంఘమిత్ర, అక్షయ్ ఉన్నారు.