
గృహ ప్రవేశానికి రండి..
● కలెక్టర్‌ను ఆహ్వానించిన ఇందిరమ్మ లబ్ధిదారు●
కై లాస్‌నగర్: బజార్‌హత్నూర్ మండలానికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారు ఉయికే సుభద్రబాయి సోమవారం కలెక్టర్ రాజర్షి షాను గ్రీవెన్స్‌లో కలిశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరుకావాలని కోరా రు. కాగా గతేడాది ఆగస్టు 7న బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దివ్యాంగురాలైన సుభద్రబాయి పరిస్థితి తెలుసుకుని ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. జిల్లాలోని తొలి లబ్ధిదారు ఆమెనే. రూ.5లక్షలతో చేపట్టిన ఇంటి నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఈ క్రమంలో సోమవారం కలెక్టర్‌ను కలిసి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పందించిన ఆయన తాను హాజరయ్యే తేదీ సమాచారం త్వరలోనే చెబుతానని తెలిపారు.